18 April, 2026 | 11:51 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశంలో సుపరిపాలన

05-06-2025 10:39 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నాయకత్వంలో సుపరిపాలన సాగుతోందని, ఫలితంగా 11 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలో నాలుగవ స్థానానికి చేరుకుందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలీ మధుసూదన్ రెడ్డి(Former BJP Kisan Morcha state president Goli Madhusudhan Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

వచ్చే స్థానిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఒద్దిరాజు రామచందర్రావు, శ్యాంసుందర్ శర్మ, చీకటి మహేష్ గౌడ్, గడ్డం అశోక్ కుమార్, పొదిల నరసింహారెడ్డి, సందీప్ కుమార్, పద్మ, పాపారావు, జయేందర్, రాజు, ఉప్పునూతల రమేష్, కిషన్, నరేష్ నాయక్, సరోజిని, భరత్ పాల్గొన్నారు.