15 April, 2026 | 12:01 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఆలుమగల అదృష్టం!

17-02-2026 01:08 AM

చైర్ పర్సన్‌గా భార్య, వైస్ చైర్మన్‌గా భర్త

నిర్మల్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ నూతన పాలకవర్గంలో నూతన ఘట్టం ఆవిష్కరించింది. సోమవారం చైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్‌గా కావ్య భర్త గణేష్ చక్రవర్తి ఎన్నికయ్యారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉండగా కాంగ్రెస్ 24 వార్డుల్లో విజయం సాధించింది.

మొదట చైర్‌పర్సన్ అభ్యర్థిగా అప్పల కావ్యను ప్రకటించినప్పటికీ వైస్ చైర్మన్‌గా మైనార్టీకి చెందిన వారికి అవకాశం ఉంటుందని అందరూ భావించారు. అయితే కౌన్సిలర్లు అందరూ అప్పల గణేష్ చక్రవర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే కుటుంబం చెందిన అప్పల అనురాధ 2005లో చైర్ పర్సన్‌గా ఎన్నికవగా, వీరి తాత అప్పల నరసయ్య 1981 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు.