24 June, 2026 | 2:31 AM

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

24-06-2026 01:28 AM

ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్, జూన్ 23 (విజయక్రాంతి): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల లోని విద్యార్థులతో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, మెడికల్ విద్యార్థులు సమాజంలో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం, రవాణా గురించి సమాచారం ఉంటే 1908కు ఫోన్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం అనే అంశంపై ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్  విద్యార్థులతో వ్యాసరచన పోటీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్, ఈగల్ టీమ్ ఎస్‌ఐ రామ్లాల్ నాయక్, మెడికల్ కళాశాల అధ్యాపకులు, సుమారు 200 మంది మెడికోస్ పాల్గొన్నారు.