calender_icon.png 17 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా

17-02-2026 01:10:12 AM

కాగజ్ నగర్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయం లో నిర్వహించిన సమావేశానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 11 మంది, ఎంఐఎం నుంచి ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్లు ఇద్దరు మొత్తం 14 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా కాంగ్రెస్ నుం చి 9 మంది, బీజేపీ నుంచి 5 మంది, స్వతంత్ర కౌన్సిలర్లు ఇద్దరు  మొత్తం 16 మంది గైరాజరయ్యారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా, చైర్మన్, వైస్త్చ్రర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 16 మంది కౌన్సిలర్ల కోరం అవసరం. అయితే 14 మంది మాత్రమే హాజరుకావడంతో ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం తిరిగి ఎన్నిక నిర్వహించే అవకాశముందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఎం ఐఎం కౌన్సిలర్ను బీఆర్‌ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నాయకులు బుధవారం కాగజ్ నగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అనంతరం ఎంఐ ఎం కౌన్సిలర్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి చైర్‌పర్సన్ ఎన్నికకు హాజరయ్యారు.