12-07-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలను కలుపుకొ ని 45 శాఖలతో పనిచేస్తున్నది. రూ.69.98 కోట్ల రికార్డు లాభాన్ని (పన్నుకు ముందు), పన్ను తర్వాత రూ.53.61 కోట్లు లాభంతో దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా 2024 --25 ఆర్థిక సంవత్సరానికి దాని వాటాదారులకు 22 శాతం డివిడెండ్ ప్రకటించింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన బ్యాంక్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలంగాణ హైకోర్టు నియమించిన అధికారి శ్రీరామ్ నారాయణ బోగా మాట్లాడుతూ.. బ్యాంకు పై నమ్మకాన్ని ఉంచినందు కు వాటాదారులు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో బ్యాంకు వ్యాపారంలో ఆశించిన వృద్ధితో బ్యాంకు వాటా దారులకు డివిడెండ్లు మరియు సిబ్బందికి ఎక్స్గ్రేషియాను ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2025--26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,135 కోట్ల డిపాజిట్లు, రూ.1040 కోట్ల అడ్వాన్సులతో 18.38 శాతం వృద్ధి రేటుతో రూ. 3,175 కోట్ల మొత్తం వ్యాపారాన్ని సాధించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుందని చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ అన్నారు. తదుపరి ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి అసౌకర్యాన్ని నివారించడానికి, బ్యాంకు అభివృద్ధికి పూర్తి సహ కారాన్ని అందించడానికి వాటాదారులు తమ కేవైసీ వివరాలను బ్యాంకు రికా ర్డులలో వీలైనంత త్వరగా నవీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎండీ, సీఈవో వీ అరవింద్ మాట్లాడుతూ.. బ్యాంక్ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను నెరవేర్చడానికి భద్రతా హార్డ్వే ర్, సాఫ్ట్వేర్లను అమలు చేయాలని బ్యాంక్ ప్రతిపాదిస్తోందని చెప్పారు.ప్రస్తుత మాక్స్ లైఫ్ ఇన్సూరెన్సుతో పాటు ఎల్‌ఐసీ, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, వారి బీమా పథకాలను విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.
ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, అనితా సోని, అరుణ్ కుమార్ భంగాడియా, బద్రివిశాల్ ముండా డ, భగవాన్ పన్సారీ, బ్రిజ్గోపాల్ అసావా, గోవింద్ నారాయణ్ రాఠి, కైలాష్ నారాయణ్ బి, సీఏ మురళీ మనోహర్ పలోడ్, ప్రేమ్ కుమార్ బజాజ్, పుష్ప బూబ్, రాంప్రకాష్ భండారి, డైరెక్టర్లు, రమాకాంత్ ఇనాని, సీఎస్ సుమన్ హెడా, ప్రొఫెషనల్ డైరెక్టర్లు, సీఏ రామ్దేవ్ భూతాడ, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్, సీఏ కిషన్ గోపాల్ మనియార్, సీఏ లక్ష్మీనారాయణ బంగాడ్, ఈఆర్ ప్రవీణ్ కుమార్ బహేతి, సీఏ ఎస్‌బీ కాబ్రా, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు, మాజీ డైరెక్టర్లు, బ్యాంక్ వాటాదారులు సమావేశానికి హాజరయ్యారు.