12-07-2025 12:41:50 AM
ముంబై, జూలై 11: ఈ నెల 15వ తేదీన ముంబైలో టెస్లా కార్ల షోరూం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ‘టెస్లా ఇండియా’ తన ఎక్స్ అకౌంట్‌లో ‘కమింగ్ సూన్’ అంటూ పోస్ట్ చేసింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించనున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఈ షోరూం అనంతరం ఢిల్లీలో షోరూం ప్రారంభించాలని టెస్లా యోచిస్తోంది. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్రయత్నాలు చేస్తోంది.