3 July, 2026 | 11:31 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

మంచి ఫలితాలు సాధించాలి

20-03-2025 12:47 AM

విద్యార్థులకు డీఈవో డిపిఆర్‌ఓల పిలుపు 

 కాటారం (భూపాలపల్లి)  మార్చి 19 (విజయక్రాంతి) : విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. గొల్ల బుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్ర మంలో మాట్లాడుతూ, విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయంగా తీర్చిదిద్దుకోవచ్చుని అన్నారు.

పరీక్షా ప్యాడ్, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులకు వ్రాసిన అందరు చదవాలి ... అందరూ ఎదగాలి అనే ప్రేరణ కర పత్ర సందేశాన్ని సిరి 10వ తరగతి విద్యార్థినివిద్యార్థులకు చదివి వినిపించగా, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రాజ్ గోపాల్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ సునీత, విద్యార్థుల తల్లిదండ్రులు,  తొమ్మిదవ తరగతి విద్యార్థులు, డిఎన్టిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుహాసిని  విద్యార్థులు పాల్గొన్నారు.