ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు
03-07-2026 09:39 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం శివాలయంలో శుక్రవారం నాడు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీవిభూషితజగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారు శ్రీశ్రీశ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు నూరి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారిని భక్తులు ధరించి స్వామి వారి నుంచి ఆశ్వీద వచనాలను స్వీకరించారు మండల వాసవి క్లబ్ వారు భక్తులకు స్వీట్స్, ఫ్రూట్స్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మగినం జయశ్రీ , ఎస్సై రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.






