15 April, 2026 | 5:02 PM

బీఆర్‌ఎస్‌కు గుడ్ బై

14-04-2026 12:46 AM
  1. బీఆర్‌ఎస్ పార్టీ  నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు 

కాంగ్రెస్‌కు గ్రీన్ సిగ్నల్  

100 మందికి పైగా చేరిక

రామగిరి, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) రామగిరి మండల మండలంలోని సెంటేనరీ కాలనీ టౌన్లోని  శ్రీపాద ఐఎన్టియుసి  భవనంలో సోమవారం  బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.నాగేపల్లి సర్పంచ్  కొండవేన దివ్యసుధాకర్ తో పాటు మాజీ సర్పంచ్ కొండవేన ఓదెలు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొండవేన ప్రభాకర్, ముస్త్యాల సర్పంచ్, సుంకరి మహేందర్ వీరితో పాటు మరికొందరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు 100 మంది బీఆర్‌ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తోందని, 

ఆయా గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా వారు అనుకున్న విధంగా అభివృద్ధి జరగకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం, సంక్షేమం సాధ్యం అని నమ్మి ముందుకు వచ్చిన వీరందరికీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నానని,  నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, గ్రామాల పరంగా కావలసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  అలాగే మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మా సోదరులందరూ కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని,

ఈ సందర్భంలో మేము చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని,  అనేక మంది రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న ఈ తరుణంలో, మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసి, తిరిగి ఎన్నికలకు ముందు అన్నింటినీ పూర్తి చేసి మళ్లీ ప్రజల ముందుకు వెళ్తామని,టీఆర్‌ఎస్ పార్టీ పరంగా ఏమీ అమలు చేయకపోయినా, రెండు సార్లు ప్రభుత్వం లోకి వచ్చిన సంగతి తెలిసిందేనని.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.మేము చెప్పిన ప్రతి మాటపై నిలబెట్టుకునే కార్యక్రమం జరుగుతున్న ఈ సమయంలో, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రజల్లో ఏ విధమైన నమ్మకం పెరుగుతోందో తెలియజేస్తోందని,  ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాదు,

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న మార్పు అని,కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకంతో ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ విజయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, అభివృద్ధి లక్ష్యంగా మీరు, మేము అందరం కలిసి పని చేయాలని మనవి చేస్తున్నానని కోరారు. ఈ కార్యక్రమం లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్, టౌన్ అధ్యక్షులు కాటం సత్యం,  ప్రజా ప్రతినిధులు,  కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు,  పాల్గొన్నారు