15 April, 2026 | 5:05 PM

దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆర్యవైశ్యులే కీలకం

14-04-2026 12:47 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): అఖిలభారత ఆర్యవైశ్య పారిశ్రామిక వేత్తల ఫోరం (ఏ.ఐ.ఏ.వి.ఐ.ఎఫ్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు పూర్వ అధ్యక్షులు పబ్బిశెట్టి రాంబాబు ప్రకటించారు.  హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షులుగా చరుగుండ్ల భవాని సురేష్, నూతన ప్రధాన కార్యదర్శిగా పడకంటి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎర్రం బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా వంశీ నేలంటి, కోశాధికారిగా బొగ్గారి శివకుమార్ లను ఫోరమ్ జాతీయ సర్వసభ్య సమావేశమలో  ఎన్నికైనట్టు ఆయన తెలిపారు.

రెండేళ్ల పాటు పద విలో కొనసాగుతారని అనే పేర్కొన్నారు. ఈ సందర్బంగా చరుగుండ్ల భవాని సురేష్ మాట్లాడుతూ  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తోపాటు అనేక రాష్ట్రాల నుండి ప్రస్తుతం 500 మంది వైశ్య పారిశ్రామికవేత్తలు అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల పోరంలో సభ్యులుగా ఉన్నారని, ఏడాదికి 50,000 కోట్ల రూపాయల ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల టర్నోవర్ జరుగుతుందని, జీఎస్టీ, టాక్స్ లు, ఇన్కమ్ టాక్స్ లద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని  ఆయన వెల్లడించారు.

ఏడాదికి 100 కోట్ల రూపాయలతో  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అనేక  సేవా కార్యక్రమాలను తమ సభ్యులు  నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. పడకంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తలను  ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఫోరంలో సభ్యులుగా ఉన్న పారిశ్రామికవేత్తల పిల్లలకు పారిశ్రామిక రంగంలో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, మంచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దలనే తమ లక్ష్యం అన్నారు.