వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం
భారత్ మధ్య ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని నేతృత్వంలో కీలక చర్చలు
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): భారతదేశం, అమెరికా దేశాల మధ్య వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకారా న్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇండియ న్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) చైర్మన్ దిలీప్ సంఘాని నేతృత్వం లో కీలకమైన చర్చా కార్యక్రమం జరిగింది.
జరిగిన ఈ చర్చలు, ఇరు దేశాల మధ్య వ్యవసాయ బంధానికి సరికొత్త ఊపును అందిస్తాయని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పేర్కొంది. వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ), పీహెచ్డీసీసీఐ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ బృందానికి ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని నేతృత్వం వహించారు.
ఈ సమావేశం అనంతరం యూఎస్‌ఐబీసీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్‌లో స్పందిస్తూ.. భారత్ వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఇదొక అత్యంత కీలకమైన అడుగు అని కొనియాడింది. దిలీప్ సంఘాని నేతృత్వంలో జరిగిన ఈ చర్చలు రెండు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారానికి సరికొత్త బాటలు వేశాయని, ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడానికి మరియు సరికొత్త అవకాశాలను గుర్తించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడింది.
ముఖ్యంగా ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ విధానాలు, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, ఆహార భద్రత, రైతుల సంక్షేమం వంటి రంగాలలో భారత్, అమెరికాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం అవసరమని కౌన్సిల్ నొక్కి చెప్పింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, అత్యా ధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, భూసారాన్ని పెంపొందించడం, రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించడం, ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, ఆహార, పోషకాహార భద్రత ను బలోపేతం చేయడం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు.






