బడుల బలోపేతమే సర్కారు లక్ష్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
మెదక్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రభు త్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే బడిబాట కార్యక్రమం చేపట్టడం జరి గిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. గురువారం పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి తండాలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, వంట గదులతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో ఇప్పటి వరకు 93 శాతం పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో రాధాకిషన్, ఎంఈవో బుచ్చయ్య నాయక్, తహసీల్దార్ గిష్మిబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






