12-05-2025 02:42:56 AM
మేడ్చల్ , మే 11 (విజయ క్రాంతి): ములుగు జిల్లా వాజేడు ఆపరేషన్ కగార్ లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందు పాత్ర పేలి మృతి చెందిన తెలంగాణ గ్రేహౌండ్సౌ జవాన్ తిక్క సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పట్టణం అంబేద్కర్ నగర్ లోని సందీప్ నివాసానికి చేరుకొని తల్లి శోభా, భార్య పావని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రభుత్వం సందీప్ తో పాటు అక్కడ మృతి చెందిన జవానులకు ప్రతి ఒక్కరికి కోటి రూపాయల స్పెషల్ ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని చెప్పారు. భద్రత స్కీం లో రూ. 80 లక్షలు, 300 గజాల ఇంటి స్థలం కేటాయించడం తోపాటు కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుందని మహేందర్ రెడ్డి వివరించారు.నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్, జంగయ్య యాదవ్ ,ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాదగిరి, సంజీవరెడ్డి తదితరులు ఆయనతో ఉన్నారు.