12-05-2025 02:44:29 AM
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మేడ్చల్, మే 11(విజయ క్రాంతి): ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలకు నిర్వహించిన ఆటల పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అనాలోచిత, క్ష నికావేశంలో చేసిన నేరం వల్ల సమాజంలో నేరం చేసిన వ్యక్తిగా పేరు పొందడమే, జైలులో పాశ్చాత్తాపడాల్సి ఉంటుందన్నారు. కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జైల్ల శాఖ డి జి సౌమ్య మిశ్రా, ఐజీలు రాజేష్, మురళి, డి ఐ జి లు సంపత్, శ్రీనివాస్, జైలు సూపర్ ఇంటెండెంట్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు వజ్రాస్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఖైదీలకు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారం, పాటలు, డ్యాన్స్, 100 మీటర్లు, 800 మీటర్లు పరుగు పందెంలో పోటీలు నిర్వహించారు. పోటీలలో 4 ప్లాటుల నుంచి 220 మంది ఖైదీలు పాల్గొన్నారు.