6 May, 2026 | 12:54 PM

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి— ఆత్మ చైర్మన్

06-05-2026 12:23 PM

బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు సంక్షేమం(Farmers Welfare) కోసం కృషి చేస్ ని బోర్డ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డులో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం 25 శాతం పంటను కొనుగోలు చేయాల్సి ఉండగా చేతులెత్తేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మొక్కజొన్న జొన్న పంట కొనుగోళ్లకు ముందుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధుతో సరిపెట్టిందని రైతులకు అవసరమైన యంత్రాలను పనిముట్లను ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు(Oil Palm Cultivation) చేస్తున్న ఐదుగురు రైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్ రమేష్. సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్. స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆకుల కుమార్ మండల వ్యవసాయ అధికారి రవితేజ సహకార సంఘం సీఈవో భార్య భూషణ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి విట్టల్ తో పాటు ఆయిల్ ఫామ్ సాగు రైతులు పాల్గొన్నారు