30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతన్న కన్నెర్ర..

06-05-2026 12:30 PM

-కోహెడ లో వడ్ల కొనుగోలు జాప్యం పై ధర్నా

కోహెడ, మే 6: (విజయక్రాంతి): ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ.. బుధవారం కోహెడ మండలం కేంద్రం లో హుస్నాబాద్ - కోహెడ రహదారి పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నమన్నారు. వడ్ల తేమ శాతం తగ్గి నష్టపోతున్నమన్నారు. మిలర్లు సైతం తాలు నేపంతో కోత పెడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు, నిర్వహకులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను   పరిష్కరిస్తామని ఐకేపీ నిర్వహకులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.