25 May, 2026 | 2:26 PM

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

18-04-2024 02:33 AM

హుజూరాబాద్, ఏప్రిల్ 17: ఆలయా ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ, రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవా రం ఆయన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..  మున్ముందు ఇల్లందకుంట ఆలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలుగా గుర్తిస్తా మని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొన్ని కార్యక్రమా లను చేపట్టలేకపోయామన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నేతలు వొడితల ప్రణవ్, దేశిని కోటి పాల్గొన్నారు.