31 March, 2026 | 2:55 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

06-11-2024 11:55 AM

రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అడవి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలు 

సంగారెడ్డి (విజయక్రాంతి): గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర అడివి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలు తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం రక్షణ కిట్లు పంపిణీ చేస్తున్నది.

ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు. ప్రమాదంలో మరణించిన గీత కార్మికులకు ఆర్థికం సహాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్వల్ప గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సైతం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. గీత కార్మికులను ఆదుకునేందుకు నీరా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నీరా కేంద్రాలను జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.