నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
10-12-2024 02:01 AM
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నేతన్నల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అమీ ర్‌పేట కమ్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పో ముగింపు కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చేనేత వస్త్ర, హస్తకళల స్టాళ్లను పరిశీలించారు. మంత్రి మాట్లా డుతూ.. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పాల్గొన్నారు.






