3 September, 2026 | 5:25 PM

ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు..

10-12-2024 | 02:01am

*బస్సు డ్రైవర్ దుర్మరణం

మునుగోడు/చౌటుప్పల్, డిసెంబర్ 9: లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన డంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మం డలం దండుమల్కాపురం ఆందోళ్ మైసమ్మ దేవాలయ సమీపంలో ఆదివారం జరిగింది. నల్లగొండ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న లారీ దండుమల్కాపురం ఆందోళ్ మైసమ్మ దేవాలయ సమీపంలోకి వెళ్లగానే ఇంజిన్‌కు డీజిల్ అందని కారణంగా ఆకస్మికంగా ఆగి పోయింది.

దాని వెనుకాలే వెళ్త్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు ఒక్కసారిగా లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సలీంపాషా క్యాబిన్‌లో ఇరుక్కపోయి అక్క డికక్కడే మృతి చెందాడు. మృతుడిది చౌటు ప్పల్ మండలం పంతంగి గ్రామం. పోలీ స్‌లు క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయ టకు తీశారు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హైద రాబాద్‌కు తరలించారు. 

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

నల్లగొండ, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి చెట్ల పొద ల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సు లో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.