6 July, 2026 | 2:26 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

ప్రభుత్వ వైఫల్యంతోనే వరి ధాన్య రైతులకు నష్టాలు

30-05-2025 07:15 PM

సారంగాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం అధికారుల అలసత్వం అసమర్థత వల్లనే వరి ధాన్యం రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కె రామ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను టిఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తామని చెప్తున్న స్థానిక కొనుగోలలో తడిసిన ధాన్యం పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తేమ నిబంధన శాతాన్ని ఎత్తివేయాలని పెట్టుబడి సాయం ఈ ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల నాయకులు పాల్గొన్నారు.