అపరిశుభ్రతకు నిలయంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి
ఆసుపత్రి వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది
చుట్టపు చూపుగా వస్తు పోతున్న జిల్లా అధికారులు రాజకీయ నాయకులు
కలెక్టర్ పలుమార్లు పర్యటించినా తీరు మారని ఆసుపత్రి అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 29, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాకి తలమానికంగా ఉండేది. నేడు ఈ ప్రభుత్వాసుపత్రిని ప్రస్తు తం వీధి కుక్కలతో ,చెత్తకుప్పలతో, హానికరమైన ఆసుపత్రి వ్యర్ధాలతో నిండుకొని ఉంది జిల్లా ఆసుపత్రి .. అపరిశుభ్రంగా కుక్కలకి ఆవులకు పశుపక్షాదులకు నిలయమైంది . పాత రోగం బాగు చేసుకోవడానికి వస్తే కొత్త రోగం అంటూ కొనే పరిస్థితి నెలకొందనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఉన్న పలు మండలాల నుండి గ్రామాల నుండి ,పెద్ద ఎత్తున బీద బడుగు బలహీన వర్గ ప్రజలు ,ఈ ఆసుపత్రిని దేవాలయంగా భావిస్తూ ఉంటారు . అలాంటి ఆసుపత్రి నేడు అపరిశుభ్రతకు నిలయంగా మారడానికి అధికా రుల నిర్లక్ష్యం అని తేటతెల్లమవుతుంది.
ప్ర భుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నేడు నెలకొంది. ఆస్పత్రి పనితీరుపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పలుమారు పర్యటించి హెచ్చరికలు జారీ చేసిన అధికారుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అధికారులు ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా సుంద రంగా తీర్చిదిచ్చే ఆసుపత్రి ఆ తర్వాత అపరిశుభ్రత నిలయంగా మారుతుంది . సమయ పాలన పాటించాలని వైద్యులు, సిబ్బంది అనే పలుమార్లు 6 పనులు వెలబడ్డ ఎవరిపైన చర్య లేకపోవడం శోచనీయం.ఆసుపత్రి వర్గాలు రోగుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.ఇప్పటికైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు ప్రభు త్వ ఆసుపత్రి పనితీరు పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.






