ఆదివాసీలు నటించిన ఆది కర్మయోగి లఘుచిత్రానికి ప్రశంస
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజుల ప్రశంసలు
చర్ల, డిసెంబర్ 29, (విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహించే విధంగా వివిధ కళల్లో రాణించే వారిని గుర్తిస్తూ ‘బతుకమ్మ యాంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ ‘ షార్ట్ ఫిల్మ్ మరియు పాటలు వీడియో పాటలు పోటీలు నిర్వహించడం జరిగింది పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఈ నెల 29న బహుమతులు ప్రధానం చేశారు. రవీంద్రభారతిలో విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు సమక్షంలో బహుమతులు అందజేశారు. తెలంగాణ ప్రజా పాలన ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పాటలను బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఆహ్వానించారు.
ఈ పోటీలో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను అందజేస్తామని ప్రకటించారు. మొదటి బహుమతి ౩లక్షలు, ద్వితీయ బహుమతి 2లక్షలు, తృతీయ బహుమతి లక్ష చొప్పున విజేతలకు ఎంఫిడీసీ చైర్మన్ దిల్ రాజు ఐ అండ్ పీఆర్ నగదు బహుమతులను అందజేసారు ఈ ఈ షార్ట్ ఫిలిం కాంపిటేషన్లో సుమారు 550 షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సంబంధించిన ఆదివాసీ యువకులు చేసిన లఘు చిత్రం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతాలలోని వర్షాకాలం మరియు రహదారి లేని గ్రామాలలో గిరిజనులు పడుతున్న అవస్థలను మేళవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జోడిస్తూ తీసిన ఈ లఘు చిత్రం ఎంతగానో ఆదరణ పొందింది, అయితే ప్రైజ్ మనీ బహుమతి దక్కించుకో పోయినప్పటికీ ప్రశంస మాత్రం అందుకుంది ఈ లఘు చిత్రం, ఆదిఖర్మయోగి లో చర్ల మండలానికి చెందిన ఆదివాసి యువకులు కోర్సా శివప్రసాద్, కారం వైష్ణవి,మడివి మహేష్, తెల్లం కవిత, మీడియం అర్జున్, మునగల నానాజీ, దుబ్బ వినోద్, కుంజ అశోక్, లు నటించి మెప్పించారు, జి.లక్ష్మణ్ కుమార్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ గా సరవనన్ వ్యవహరించారు, సాగర్ పర్యవేక్షణ లో చేశారు, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఆదివాసి యువకులు నటించడం ఆది కర్మయోగి లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో తీసుకువెళ్లి ప్రశంసలు అందుకోవడం పట్ల పలువురు ప్రశంసించారు.






