11 July, 2026 | 1:50 AM

ప్రభుత్వ సంస్థలను కాపాడాలి

11-07-2026 12:47 AM

ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్  

అబ్దుల్లాపూర్‌మెట్, జులై 10: ప్రభుత్వ సంస్థను  కాపాడి.. పెండింగ్ లో స్కాలర్ షి ప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చే యాలని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండె శివకుమార్ అన్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడి.. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నాయకుల పిలుపు బంద్ సక్సెస్ అయ్యింది.

అనంతరం శివకుమార్ మాట్లాడుతూ... మండల పరిధిలో విద్యాసంస్థలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్,  ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలన్నారు.  ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని.. మెస్ కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.  లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్ష, కార్యదర్శలు వంశీ, శేషు, హరీష్, పాషా, శశి, భార్గవి, ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు వెంకట్, సత్యం లోకేష్ తదితరులు పాల్గొన్నారు. తుర్కయాంజల్ లో విద్యాసంస్థల బంద్ ప్రశాంతం ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపు తుర్కయంజాల్ లో విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా తోడే  సుమంత్,  కొప్పుల కార్తీక్ మాట్లాడుతూ... జీవో 46ను కఠినంగా అమలు చేస్తూ ప్రైవేట్ ఫీజులను అదుపు చేయాలన్నారు. విద్యాసంస్థల్లో పుస్తకాలు, యూనిఫారాల కమర్షియల్ విక్రయాలను నిలిపివేయించాలన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న డీబీటీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, ఎం ఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. డీబీటీ విధానం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొడ్డుపల్లి సైదులు, గాడుదల విగ్నేష్, కాళ్ళ అఖిల్, కొనుగుల చరణ్ తేజ, కాళ్ల గౌతం ,ఎండి అల్తాఫ్, సిలివేరు సాయి తేజ, తదితరులు పాల్గొన్నారు.