ఉచిత మగ్గం వర్క్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
11-07-2026 12:47 AM
నసురూల్లాబాద్ జులై 10 { విజయ క్రాంతి }: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటీ ఆధ్వర్యంలోని మగ్గం వర్క్ రెండవ బ్యాచ్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని ఆర్సేటి డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.
31 రోజుల శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంత మహిళలు పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ , ఐదు ఫోటోలతో సుల్లాబాదులోనీ ఆర్సిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9247540478 నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవాలన్నారు.






