3 June, 2026 | 1:38 AM

గ్రామసభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

03-06-2026 12:00 AM

కలెక్టర్ నారాయణ రెడ్డి 

రంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): జిల్లాలో జూన్ 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలను విస్తృతంగా నిర్వహించి, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ సభలను నిర్వహించి, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక విస్తృత పునర్విమర్శ (ఎస్‌ఐఆర్)లో భాగం గా కొత్త ఓటర్ల నమోదు, మ్యాపింగ్ ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ లు) ఈ సభల్లోనే అక్కడికక్కడే పారదర్శకంగా చేపట్టాలన్నారు.

అలాగే, రైతులందరికీ ప్రభుత్వ సబ్సిడీలు, బీమా అందేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ‘రైతు నమో దు’ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి పట్టణాల్లో డ్రైనేజీల శుభ్రత, గ్రామాల్లో నీటి పారుదల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఐదు రోజుల్లోగా మిల్లులకు తరలించాలని, రవాణాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పర్యావరణ వారోత్సవాల సందర్భంగా విస్తృతంగా మొ క్కలు నాటాలని, ’స్వచ్ఛ గ్రామాలు  స్వచ్ఛ పట్టణాలు’ లక్ష్య సాధనలో భాగంగా తడి-పొడి చెత్త వేరు చేస్తూ ఘన వ్యర్థాల నిర్వ హణను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కా న్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.