మేడ్చల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
మేడ్చల్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిధి ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు జెండా ఆవిష్కరించారు.
కలెక్టర్ మను చౌదరి, డిసిపి సురేష్ కుమార్, అదన పు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ లతో కలిసి కె.కేశవరావు పోలీసు గౌవర వందనాన్ని స్వీక రిం చారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అ భివృధ్ధి, సంక్షేమ పథకాల వివరాలను, వాటి పురోగతిని వివరించారు. జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇం డ్లును మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గూడులేని పేదలకు నీడకల్పించి వారి భవిష్యత్తుకు భరోసాకల్పిస్తున్నట్లు ఆ యన పేర్నొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మ న దేశంలోనే కాక, ప్రపంచ స్థాయిలో నెంబ ర్ వన్ గా నిలిపేందుకు గౌరవ ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగా ణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభు త్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, ప రిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాల తో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించటం జరుగుతుం దన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్తో కలి సి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన ముగ్గురి కుటుంబ సభ్యులను శాలువా, పండ్ల బోకే తో సన్మానించారు. అంతకుముందు కీసర చౌరస్తాలోని తెలంగాణ అ మరవీరుల స్మారక చిహ్నము వద్ద పూల గుచ్ఛాలతో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కీసర ఎం ఆర్‌ఓ యాదగిరిరెడ్డి లు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో డిఆర్ ఓ మాలతి, ఇంచార్జీ మైనార్టీ అధికారి జి. కాంతమ్మ, కలెక్టరేట్ ఎఓ సుజాత, వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ, సివిల్ సప్లై శాఖ డియం. సుగుణబాయి, డియస్ ఓ శ్రీనివాసరెడ్డి డిఆర్డిఓ సాంబశివరావు, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి వినోద్ కుమార్, ఇంటర్మీడియెట్ అధికారి కిషన్, డిటిఓ వెంకటేశ్వ ర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్లోన్నారు.






