3 June, 2026 | 1:48 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

03-06-2026 12:00 AM

కేసముద్రం, జూన్ 2 (విజయక్రాంతి): కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సుజాత, పి ఈ టి విజయనిర్మల తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అథ్లెటిక్ విభాగంలో పాల్గొన్న జే.హన్సిక, బి.మేఘన, ఎన్. ప్రియాంక ఈనెల 11, 12 తేదీల్లో హైదరాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.