7 May, 2026 | 1:29 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు

07-05-2026 12:04 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, మే 6 : నకిరేకల్ మున్సిపాలిటీలో చాలా మంది పేద వారు ఉన్నారని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం  తెలిపారు. నకిరేకల్ మున్సిపాలిటీలో మంగళవారం, బుధవారం  రెండు రోజుల లో సుమారు 17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. వాటితోనే నకిరేకల్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు, మరియు కాలంవారి కుంట ఆధునీకరణ వేగంగా పూర్తి చేస్తామని అని ఆయన తెలిపారు. నకిరేకల్ మున్సిపాలిటీలో చాలా మంది పేద వారు ఉన్నారని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి వైపు అండగా ఉండాలి అని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సి ఆlర్లు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.