16 July, 2026 | 12:17 AM

ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాలి

16-07-2026 12:00 AM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

ఘట్ కేసర్, జూలై 15 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వo ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడం కార్యకర్తల బాధ్యతగా గుర్తించాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. పోచారం  డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వ ర్యంలో బుధవారం పోచారం, అన్నానగర్, నారపల్లి లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సర్ ఓటర్ అవగాహన కార్య క్రమాలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  వజ్రేష్ యా దవ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిం చారు. ఈసందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్త లంతా ఐకమత్యంతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం సర్ కార్యక్రమానికి సంబంధించి ఎస్‌ఆర్‌ఆర్ లు, బిఎల్‌ఏ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత అధికారులకు వెంటనే సమర్పించాలని సూచించారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని కర్రె రాజేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, ఓబీసీ సెల్ అడ్వైజర్ శ్రవణ్ కుమార్ గౌడ్, బద్దం నర్సింహారెడ్డి, పోచారం డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,  చంద్రకాంత్, 2వ వార్డు అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, పాలడుగు అమరేందర్ రెడ్డి, బండ్లగూడ నాగేష్ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్, కొంతం శంకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్,  పాల్గొన్నారు.