11 April, 2026 | 2:00 AM

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

11-04-2026 12:07 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఏప్రిల్ 10: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు.శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 30 మందికి కళ్యాణ లక్ష్మి పథకం , 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉచితంగా మొబైల్ ఫోన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బాల్రెడ్డి, రమాకాంత్ రెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.