5 June, 2026 | 9:43 PM

పర్యావరణం బాధ్యత.. ప్రతి ఒక్కరు బాధ్యత

05-06-2026 08:48 PM

ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): పర్యావరణం బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని ఆర్కే సంస్థల సీఈవో జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాల ఆవరణలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాల కు మార్గదర్శకం కావాలన్నారు.