5 June, 2026 | 10:11 PM

మొక్కలు నాటిన ఎంపీడీవో శ్రీజ రెడ్డి

05-06-2026 09:01 PM

ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన గట్టు కృష్ణమూర్తి

మంథని,(విజయక్రాంతి): జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మండల అభివృద్ధి అధికారిణి కె శ్రీజా రెడ్డి మొక్కలు నాటారు. మంథని ప్రాంతంలో పర్యావరణ ప్రియుడిగా పేరుగాంచిన గట్టు కృష్ణమూర్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీజా రెడ్డి మాట్లాడుతూ మంథని పరిసర ప్రాంతాల్లో గత ఐదు సంవత్సరాలుగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కృష్ణమూర్తి వేయికి పైగా మొక్కలు నాటారని కొని ఆడారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్న కృష్ణమూర్తిని మండల వ్యవసాయ అధికారిణి డాక్టర్ నవ్య ఈ సందర్భంగా అభినందించారు. కృష్ణమూర్తి జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు పొందడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని శ్రీజా రెడ్డి, నవ్యలు గుర్తు చేశారు. అనంతరం కృష్ణమూర్తిని సన్మానించారు.