5 June, 2026 | 10:11 PM

సమాజ సేవకునికి రాష్ట్రస్థాయి గుర్తింపు

05-06-2026 09:36 PM

అఖిలభారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంబోజు సమ్మయ్య నియామకం 

మంథని,(విజయక్రాంతి) మంథని పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణ వేదిక నాయకుడు జంబోజు సమ్మయ్య చారి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంథని ప్రాంత విశ్వకర్మ సంఘం నాయకులు శుక్రవారం హర్ష వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా  సమాజానికి విశిష్ట సేవలందిస్తున్న బ్రహ్మశ్రీ జంబోజు సమ్మయ్య చారి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులు కావడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం అన్నారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్ చారి నియామక ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు.

ఈ సందర్భంగా జంబోజు సమ్మయ్య చారి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్ చారికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వకర్మ బంధువుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో కృషి చేస్తానని సమ్మయ్య హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ సమాజ ఐక్యతకు, అభివృద్ధికి సామాజిక పురోగతికి తన వంతు సేవలను అందిస్తానని ఆయన తెలిపారు. సంభయ్య చారి అందరితో కలుపుగోలుగా ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే కష్టజీవి అని సంఘం సభ్యులు కొనియాడారు.  సమ్మయ్య చారి నియామకం పట్ల విశ్వకర్మ సంఘాల నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.