11 April, 2026 | 2:08 AM

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

11-04-2026 12:06 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 10: మండలంలోని కల్వకోలు గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు అందజేశారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దకోతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహా, కల్వకోలు సర్పంచ్ బి.శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.