25 June, 2026 | 1:32 AM

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల

25-06-2026 12:00 AM

తాడ్వాయి, జూన్, 24( విజయ క్రాంతి ): ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కన్కల్ ప్రభుత్వ పాఠశాల రూపుదిద్దుకుందని పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ ప్రభుత్వ పాఠశాలను ఆయన డిఈఓ మల్లికార్జున్‌తో కలిసి బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు.డీఈవో మల్లికార్జున్ మాట్లాడుతూ... అన్ని ప్రభుత్వ పాఠశాలలు కన్కల్ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. ఈ సందర్భంగా డిఇఓ ను ఎంఈఓ రామస్వామిని కన్కల్ గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ రెడ్డి నాయకులు సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.