25 June, 2026 | 1:31 AM

రేకుల షెడ్డు కింద వాహనాలు పార్కింగ్

25-06-2026 12:00 AM

నేలపై భోజనం చేస్తున్న భక్తులు 

బాసరలో భక్తుల బాధలు 

కుబీర్, జూన్ 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయమైన బాసరలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అమ్మవారి గుడిలో అక్షరాభ్యాసాన్ని చేయించుకునేందుకు చిన్న పిల్లలతో వస్తున్న భక్తులకు ఆలయ అధికారుల నిర్వహణలోపం కారణంగా అక్కడ కనీస సౌకర్యలేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రైతుల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నప్పటికీ భక్తులకు సరిపడా వసతి గృహాలు పార్కింగ్ ప్లేస్ లు కూర్చోవడానికి సరైన ప్రదేశాలు లేవు. ఉన్న ప్రదేశాలు కొందరు తమ వాహనాలను రేకుల షెడ్ల కింద ప్రధాన రోడ్లపై పార్కింగ్ చేయడంతో స్థలాలు లేక భక్తులు తమ పిల్లలతో కలిసి మెట్లపై జనం వెళ్లే మార్గాల మధ్యన కూర్చుండి భోజనాలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పాఠశాల పునః ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల రద్దీ గత 15 రోజులుగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతున్న క్యూలైన్లో నిలబడలేక వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు.

నిలబడ్డ వారికి నీటి సౌకర్యం కూడా లేదని భక్తులు వాపోతున్నారు. దీంతో భక్తులు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూర్చుంటే పోలీస్ సిబ్బంది వచ్చి వెళ్లగొడుతున్నారని పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపిన వాటి గురించి పట్టించుకోవడం లేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాలు కూడా దొరకడం లేదని దీంతో ప్రైవేట్ వసతి గృహాలు ఎక్కువ డబ్బులు చెల్లించవలసి వస్తుందని వారు తెలిపారు. సామాన్య మద్దతు భక్తులకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.