ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి
జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి, జూన్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను, నాణ్యత ప్రమాణాలను పెంచడానికి అధికారులు బాధ్యతాయుతంగా పనిచే యాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడా రు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం ప్రతి మండ లానికి కోటి రూపాయల కేటాయించినట్టు చెప్పారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వలిగొండ మూసీ బ్రిడ్జి మరమ్మ తులతో పాటు పంచాయతీరాజ్, అర్‌అండ్‌బీ రోడ్డు పనులపై ఇంజినీరింగ్ అధికారు లు దృష్టి సారించాలని కోరారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ మాట్లాడుతూ.. మోత్కూరులో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించా రు. రైతుబంధు ఎన్ని ఎకరాల వరకు అందించారని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా వ్యవసాయాధికారిని ప్రశ్నించగా.. అధికారికంగా జిల్లాస్థాయిలో వివరాలు అందు బాటు ఉండవని సమాధానం ఇచ్చారు.
వేదికపై సీటు కోసం పట్టు..
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు సమావేశ వేదికపై సీటు ఏర్పాటు చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే కోరారు. అయితే, నిబంధనల ప్రకారం సమావేశపు ప్రత్యేక ఆహ్వానితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వేదికపై సీటు ఏర్పాటుకు అవకా శం లేదని జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ హోదా ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపై ఆసీనులు కావడానికి అర్హులుగా పేర్కొన్నారు. అయితే, దీనిపై సామ్యేల్ పట్టు వీడకపోవడంతో ప్రభుత్వ విప్ నచ్చజెప్పారు.






