అంకితభావంతో పనిచేయాలి
ఉద్యోగులకు కలెక్టర్ నారాయణ రెడ్డి సూచన
వికారాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని వికారాబాద్ కలెక్టర్ సీ నారా యణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ వసతి గృహాలు, గురుకులాల ప్రిన్సిపాల్స్, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంటుందని, మనసుకు సంతృప్తినిచ్చే విధం గా పనులు చేయాలని సూచించారు.
ప్రభు త్వ వసతి గృహాలకు ప్రభుత్వం ఎంతో డబ్బు ను ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ ఉత్తీర్ణత శాతం అనుకున్న స్థాయిలో రావడం లేదన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత ఈ ఏడాది 70 శాతానికి తగ్గకుండా చూడాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతిగృహ విద్యార్థుల ఫలితాలు ఉండాలన్నారు. పేదలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులే వసతి గృహాల్లో ఉండి చదువుకుంటారని, వారి విషయంలో అధికారులు తల్లిదండ్రుల పాత్రను పోషించి చదువులో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి అధికారి మల్లేశం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.






