calender_icon.png 29 August, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌కు హెలికాప్టర్ పంపిన సర్కార్

29-08-2025 04:10:01 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

బెజ్జూర్ ,ఆగస్టు 28(విజయ క్రాంతి): తెలంగాణ హెలిక్యాప్టర్లను బీహార్ కు పంపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం బెజ్జూరు మండలంలో కార్యకర్తలతో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రాం తానికే లాభం చేకూరేలా ఉందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు.

వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం మాత్రం స్థానిక ఎన్నికల్లో గెలవడానికి సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రజల ప్రాణాల కంటే ఎన్నికల ముఖ్యమా అని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారని, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం, ఫోర్త్ సిటీ కాంట్రాక్టర్ల పేరుతో ఆంధ్రకు చెందిన సీఎం రమేష్ లాం టి వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.

స్థానిక ఎమ్మెల్యే హరీష్‌బాబు వల్లే బిందా రైతులు కష్టాల పాలవుతున్నారన్నారు. కార్యకర్తలు నాయకులు సైనికుల పనిచేసే స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియో జకవర్గ కన్వీనర్ శ్యామ్ రావు నాయకులు హర్షద్ హుస్సేన్, సారయ్య, తిరుపతి ,విశ్వనాథ్ , మనోహర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.