29-08-2025 10:41:58 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో(Orient elections) శుక్రవారం జరుగుతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Bhaskar) పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద కంపెనీ కార్మికులను మాత్రమే అనుమతించాలని స్థానిక పోలీసులతోపాటు, పోలింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓరియంటల్ సిమెంట్ కంపెనీలో పోలింగ్ సరళిని సమీక్షించి పోలీసులకు పలు సూచనలు చేశారు. డీసీపీ భాస్కర్ బెల్లంపల్లి ఏసీపి రవికుమార్ ఉన్నారు.