29-08-2025 04:11:22 AM
ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, ఆగస్టు 28: భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతి లక్షంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండలంలోని పూల గ్రామంలో బీజేపీ దళిత కార్యకర్త సాధు ప్రభాకర్ ఇంట్లో జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఆయన ఇంట్లోనే భోజ నం చేసి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వా మ్య లౌకికవాదానికి కట్టుబడి ఉందని అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం దళితవాడలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈ గజ్జరం. ఎంపీటీసీ కట్ట రవి బీజేపీ నాయకులు రమణారావు కార్యకర్తలు ఉన్నారు.