29-08-2025 09:53:05 AM
హైదరాబాద్: కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాల్లో(Medak districts) భారీ వర్షాలు కురిశాయి. ఈ మూడు జిల్లాల్లో మంగళవారం నుంచి కురిసిన భారీ వర్షాలకు(heavy rains) వాగులు, కాలువలు, నాలాలు చెరువులు పొంగిపొర్లాయి. భారీ వర్షాలకు జాతీయరహదారులు, పల్లెల్లోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కామారెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో విద్యా శాఖ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు(Educational Institutions ) మరో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది.
ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135 శాతం అధికంగా వర్షం పడింది. రాజంపేట, భిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, నిజాంసాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివ నగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, గాంధారిలో రెండు రోజుల్లో 30 నుంచి 60 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హవేలి ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా, రాజీపేట, నాగిరెడ్డిపల్లి, బూరుగుపల్లి, వాడి, సర్దన, కొత్తపల్లి గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కరెంట్ సమస్య తలెత్తడంతో మూడు రోజులుగా స్థానికులు అంధకారంతో ఇబ్బందులు పడుతున్నారు.