29-08-2025 09:30:48 AM
అమరావతి: విశాఖలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్(Fourth Town Police Station) ఎదురుగా జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను గుర్తించి డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.