calender_icon.png 29 August, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలే

29-08-2025 10:38:50 AM

  1. రోడ్ల భద్రతను కాపాడేదెవరు
  2. లారీలు రోడ్ల పైన పార్కింగ్ 
  3. రోడ్లపైనే ఇసుక లోడింగ్
  4. చలించని అధికారుల తీరు

మంగపేట, (విజయక్రాంతి): ఏటూరునాగారం బూర్గంపహాడ్ జాతీయ రహదారిపైన ఇసుక లారీలను నిలిపి రోడ్లపైనే లారీలలో ఇసుక లోడింగ్ చేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. చుంచుపల్లి వాడగూడెం రమణక్కపేట ఇసుక క్వారీ నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు.

రోడ్లపై వందలాది ఇసుక లారీలను నిలబెట్టి

కరెంటు లేదు ఆన్లైన్ పనిచేయడం లేదు అన్న గుడ్డి సాకుతో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల పిర్యాదుల మేరకు మైనింగ్ రెవిన్యూ పోలీస్ అధికారులు ఎన్నిసార్లు చెప్పిన ఇసుక రిచ్ కాంట్రాక్టర్ల తీరు మారడం లేదు ఎవ్వరైనా అడిగితె పేపర్లకే బోర్డులకే పరిమితం ఎక్కడో అక్కడ స్థలం చూపిస్తూ కోట్ల రూపాయలను ఖజానాలో దాచుకుంటున్నారు. ఇదంతా అధికారుల అండ దండల తో నడుస్తుందని ప్రజలు గుస గుస లాడుతున్నారు.