calender_icon.png 13 January, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వమే మల్సూర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

13-01-2026 08:36:36 PM

ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల 

మోతే,(విజయక్రాంతి): ఉప్పుల మల్సూర్ విగ్రహం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి అధికారికంగా వేడుకలు చేయాలని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న జిల్లా కార్యదర్శి ఎస్కె నజీర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే ఉప్పుల మల్సూర్ 27వ వర్ధంతి సందర్బంగా మల్సూర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... నమ్మిన సిద్ధంతం కోసం కడవరకు కమ్యూనిస్ట్ గా కొనసాగుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ ఎలాంటి మచ్చ లేకుండా పని చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ గా కూడా ఏకగ్రీవంగా ఎంపిక ఆయన జీవితం చివరలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించిన వ్యక్తి నేటి తరాలకు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు. నేతలు మల్సూర్ ఇంటికి వచ్చి పోయేవారు. కనీసం మల్సూర్ కుటుంబానికి ఒక ఇల్లు నిర్మాణం చేయక పోవడం విడ్డురంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లొ ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కాంపాటి శ్రీనివాస్, మల్సూర్ కుటుంబ సభ్యులు కొమురక్క నాయకులు జానయ్య, వెంకన్న, నరేందర్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.