calender_icon.png 13 January, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ విద్యావేత్త ఎంఎన్ రెడ్డి సేవలు మరువలేనివి

13-01-2026 08:39:18 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రముఖ విద్యావేత్త ముప్పా నరసింహారెడ్డి (ఎం.ఎన్.రెడ్డి) సేవలు మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన విద్యావేత్త ఎం ఎన్ రెడ్డి సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, బొబ్బలి రాంరెడ్డి, రెముడాల మధు తదితరులు పాల్గొన్నారు.