ఆపదలో ప్రజలకు ప్రభుత్వ అండ
ఎంఎల్‌ఏ పీఎస్‌ఆర్
మంచిర్యాల టౌన్, మే 22 : ఆపదలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. శుక్ర వారం ఎంఎల్‌ఏ ఇంటి వద్ద మంచిర్యాల నియోజక వర్గంలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 40,71,400ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






