15 August, 2026 | 3:38 AM

విద్యార్థుల అభివృద్ధికి అండగా ప్రభుత్వం

15-08-2026 12:26 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

గురుకుల విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందజేత

మొయినాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు పలు రకాల విద్యా, నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు. పెద్దమంగళారం అజాద్ కాలేజీలోని TGMR పాఠశాల, కళాశాల బాలికలకు యూనిఫామ్లు, దుప్పట్లు, ప్లేట్లు, బెడ్షీట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేశారు.

అనంతరం చిల్కూర్లోని TGR బాలుర పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమాల్లో మొయినాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, వైస్ చైర్మన్ గరుగు రాజు, కమిషనర్ జాకీర్ అహ్మద్, స్థానిక వార్డు కౌన్సిలర్లు, పాఠశాల, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, పీఎంసీ సిబ్బంది, మాజీ సర్పంచులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.