15 August, 2026 | 1:41 AM

హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో సత్యాగ్రహ దీక్ష

15-08-2026 12:27 AM

కామారెడ్డి,ఆగస్టు 14, (విజయక్రాంతి): హల్ద్వానీ ఘటనకు నిరసనగా, ఏఐసీసీ అధ్యక్షులు  మల్లికార్జున్ ఖర్గే కు సంఘీభావంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా డీసీసీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, సౌబ్రాతృత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు , కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు  ఐరేని సందీప్ కుమార్ , కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.